సిల్వర్‌తో సరిపెట్టుకున్న జ్యోతి !

Telugu Lo Computer
0


ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజి రజత పతకం సాధించింది. ఈ పోటీలో చైనా రేసర్ యానివు గన్ షాట్ (స్టార్టింగ్ షాట్)కు ముందే పరుగు ప్రారంభించింది. దీంతో ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్‌ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. దీంతో రేస్‌ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్‌ ఫుటేజ్‌లను పరిశీలించి చైనా రన్నర్‌ను అనర్హురాలిగా ప్రకటించారు. అదే సమయంలో జ్యోతి ఉద్దశపూర్వకంగా ఈ తప్పిదం చేయలేదని నిర్ధారింంచారు. దీంతో ఆమెకు రజతం ప్రకటించారు నిర్వాహకులు. అయితే ఒక చైనా అథ్లెట్‌ చేసిన తప్పిదం కారణంగా జ్యోతి ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. హర్డిల్స్ పోటీల్లో పతకం సాధించిన భారతదేశపు తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)