మధ్యప్రదేశ్లోని షాపూర్ జిల్లా ఓ మహిళ ఆస్పత్రిలో టాయిలెట్లో శిశువుకు జన్మనిచ్చిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. మహిళకు హెచ్ఐవీ ఉందనే కారణంతో డెలివరీ చేసేందుకు డాక్టర్లు, నర్సులు నిరాకరించారు. దాంతో దిక్కు తోచని స్థితిలో మహిళ టాయిలెట్లో ప్రసవించింది. అయితే ఆస్పత్రి డాక్టర్లు మరోలా చెబుతున్నారు. డెలివరీకి ఆస్పత్రిలో చేరిన మహిళకు మొదట్లో హెచ్ఐవీ ఉన్నట్లు మాకు తెలియదు. పరీక్షలు నిర్వహించాక హెచ్ ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను మెటర్నిటీ ట్రామా సెంటర్ లో చేర్చాం. అయితే ఆమె వెనకనుంచి బయటికి వెళ్లి బాత్ రూంలో ప్రసవించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ సీత్యా నాయక్ చెప్పారు. బిడ్డను, తల్లిని వేర్వేరుగా ఉంచారు. ఇదిలా ఉంటే వైద్యులు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. మహిళకు చికిత్స చేసిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు హెచ్ఐవీ సంక్రమణ నుంచి రక్షణ కోసం టీకాలు ఇచ్చారు.
ఆస్పత్రి టాయిలెట్లో బిడ్డకు జన్మనిచ్చిన హెచ్ఐవీ రోగి !
October 14, 2023
0
Tags