ఓటర్లకు ఫ్రీ పోహా, జిలేబీ - '56 దుకాణ్‌' ఆఫర్‌ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్‌ 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌- భాజపా మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లోని ఫుడ్‌ హబ్‌ అయిన '56 దుకాణ్‌' యజమానులు వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. ఎవరైతే తొలుత ఓటు వేసి వేలికి ఇంకును చూపిస్తారో వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకే ఈ ఆఫర్‌ను ప్రకటించామని '56 దుకాణ్‌' ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గుంజన్‌ శర్మ వెల్లడించారు. పరిశుభ్రత విషయంలో దేశంలో ముందు వరుసలో ఉన్న ఇండోర్‌ను ఓటింగ్‌ శాతంలోనూ అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ఈ ప్రయత్నమని తెలిపారు. ఓటింగ్‌ రోజు నిర్దేశిత సమయం దాటిన తర్వాత ఓటు వేసి వచ్చిన వారికి 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని చెప్పారు. ఇండోర్‌ అర్బన్‌ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2018లో 14.72 లక్షల ఓటర్లలో 67 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి 15.55 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)