హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్‌లో ఓ ఏనుగు మావటిపై దాడి చేసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్(28) అనే మావటిపై ఓ ఏనుగు హఠాత్తుగా దాడి చేసింది. సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదారుగురు మావటిలు విధుల్లో ఉంటారు. శనివారం జూపార్క్ 60 సంవత్సరాల వేడుక సందర్భంగా కొంత మంది అక్కడి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో షాబాజ్ ఒక్కరే విధుల్లో ఉన్నారు. అయితే, ఒక్కసారిగా ఏనుగు ముందుకు దూసుకొచ్చి అతడ్ని నేలకేసి కొట్టింది. తీవ్రగాయాలపాలై కొనఊపిరితో ఉన్న బాధితుడిని అక్కడి సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే షాబాజ్ మృతి చెందినట్లు ధృవీకరించారు.
ఏనుగు దాడిలో మావటి మృతి
October 07, 2023
0
Tags