రైలు ముందు దూకి మహిళ బలవన్మరణం

Telugu Lo Computer
0


దులుతున్న రైలు ముందుకు దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యూపీలోని హపూర్ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. రైల్వే స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. వీడియోలో మహిళ ప్లాట్‌ఫాం నుంచి రైల్వే ట్రాక్‌లపైకి దిగడం కనిపించింది. ప్లాట్‌ఫాం అవతలివైపు ఆమె వెళుతుందని అంతా భావిస్తుండగా, అనూహ్యంగా ఆమె వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లడంతో అందరూ వెనుకకు వెళ్లాలని వారించారు. ఆపై మహిళ రైలుకు ఎదురుగా ట్రాక్‌పై కూర్చుండగా ఆమెపై నుంచి రైలు వెళ్లడంతో ఘటనా స్ధలంలోనే మరణించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని రైల్వే అధికారులు తెలిపారు. మరణించిన మహిళ వివరాలను గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)