కేంద్ర ప్రభుత్వం 2024 లోక్‌సభ ఎన్నికల వరకు గవర్నర్‌గా ఆర్.ఎన్. రవిని కొనసాగించాలని తమిళనాడు గవర్నర్‌పై సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. డీఎంకే ఎన్నికల ప్రచారానికి గవర్నర్ సాయం చేస్తున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెన్నైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ''ద్రవిడం అంటే ఏంటి? అని ప్రతిసారీ అడుగుతున్న వ్యక్తినే గవర్నర్‌గా కొనసాగించాలని నా ఉద్దేశం. దానివల్ల ద్రవిడ సంస్కృతి గురించి మనం చేస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. లోక్‌సభ ఎన్నికల వరకు గవర్నర్‌ను మార్చొద్దని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నా. గవర్నర్ స్థానంలో ఉండి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, రాష్ట్ర ప్రజలు ఆయన మాటల్ని పట్టించుకోవడంలేదు'' అని స్టాలిన్ విమర్శించారు. తమిళనాడు గవర్నర్‌గా ఆర్.ఎన్. రవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆయన విబేధిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాజ్‌భవన్ వద్ద పెట్రోల్ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చారని రాజ్‌భవన్ వర్గాలు ఆరోపించాయి. మరోవైపు తనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన పోరాటాలు, రాజకీయ ప్రముఖుల విమర్శలువంటి వాటితో కేంద్ర హోంశాఖకు సమగ్ర నివేదిక పంపాలని గవర్నర్ ఆర్.ఎన్. రవి నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్రంపై స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు !
October 27, 2023
0
Tags