మృతదేహాన్నిమార్చురీ పెట్టి 17 రోజుల పాటు మరచిపోయిన వైద్యులు !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఓ 70ఏళ్ల వృద్ధుడిని గ్రేటర్‌ నోయిడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి జులై 22న తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సెప్టెంబర్‌ 23న అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే, ఆ వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి మాత్రం అప్పటి నుంచి అందుబాటులో లేడు. అతడి సంబంధీకులు కూడా ఎవ్వరూ రాకపోవడంతో వైద్యులు కూడా ఆ విషయాన్ని మరచిపోయారు. ఇటీవల మార్చురీలోని ఫ్రీజర్‌ను తెరచిన వైద్యులకు అందులో మృతదేహం కనిపించింది. ఆరా తీస్  17 రోజుల క్రితం చనిపోయిన వృద్ధుడిదని తెలిసింది. ఇలా ఫ్రీజర్‌లో మృతదేహాన్ని పెట్టి మరచిపోవడాన్ని యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ తీవ్రంగా పరిగణించారు. ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న ఆయన దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. ఇలా రోగుల సంబంధీకులు లేని కేసులు తరచుగా వస్తున్నాయని.. ఇలాంటి కేసుల్లో వారి చికిత్స బాధ్యతలు మొత్తం ఆసుపత్రి వర్గాలే చూసుకుంటున్నాయని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)