ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనుకుంటుంది !

Telugu Lo Computer
0


హారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'కేంద్రపాలిత ప్రాంతం' చేయాలనుకుంటోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎజెండా ఇదేనని మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సోమవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ మహమ్మారి, నోట్ల రద్దు, మణిపూర్ అంశాలపై ఎప్పుడూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయలేదని, కానీ ప్రస్తుతం రాబోతున్న సమావేశాల్లో ముంబైని యూటీ ప్రాంతంగా ప్రకటించి మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల నుంచి విడదీస్తుందని ఆరోపించారు. ముంబై ఒక అంతర్జాతీయ నగరం, ఆర్థిక రాజధాని అని.. ఇప్పుడు ముంబైలోని ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, డైమండ్ మార్కెట్ వంటి వాటిని నగరం నుంచి తరలించేస్తున్నారని పటోలే ఆరోపించారు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లను గుజరాత్‌కి మార్చే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో శివసేస-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలకు అడ్డంకిగా ఉందనే కేంద్రంలోని బీజేపీ అధికారంలోంచి దించేసిందని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)