మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సూపర్‌స్టార్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కు నమస్తేతో స్వాగతం పలికారు. వారిద్దరూ కరచాలనం చేసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వీరు చాలా సేపు సమావేశమయ్యారు. వారు పలు రాజకీయ అంశలపై చర్చించుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అన్వర్ ఇబ్రహీం ఎక్స్(ట్వీట్) చేశాడు. "ఈ రోజు నేను భారతీయ చలనచిత్ర నటుడు రజనీకాంత్ ను కలిశాను. అతను ఆసియా, అంతర్జాతీయ కళా ప్రపంచ వేదికపై సుపరిచితుడు. ముఖ్యంగా ప్రజల కష్టాలు, కష్టాల విషయంలో నా పోరాటానికి ఆయన ఇచ్చిన గౌరవాన్ని అభినందిస్తున్నాను. క్యాజువల్‌గా చర్చించిన విషయాలలో,భవిష్యత్తులో ఆయన సినిమాల్లో చేర్చడానికి నేను ప్రయత్నిస్తున్న సామాజిక అంశాలకు సంబంధించినవి. రజనీకాంత్ ఈ రంగంలోనూ, సినిమా రంగంలోనూ రాణించాలని ప్రార్థిస్తున్నాను" అని మలేయ్ లో ట్వీట్ చేశారు.
మలేషియా ప్రధానితో రజనీకాంత్ భేటీ
September 11, 2023
0
Tags