నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు !

Telugu Lo Computer
0


నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు లోకేశ్‌కు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు పంపించింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. నోటీసులు అందినట్లు లోకేశ్ సీఐడీకి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం నారా లోకేశ్ న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటిలో నారా లోకేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ గల్లా జయదేవ్ ఇంటికి లోకేష్ కోసం వచ్చిన సీఐడీ అధికారులతో నవ్వుతూ మాట్లాడారు. రాకరాక వచ్చారు.. కాఫీ, టీ తీసుకోండి అంటూ లోకేశ్ అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చిన సీఐడీ అధికారులను నారా లోకేశ్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 'ఎలా ఉన్నారు? కాఫీ, టీ తీసుకుంటారా? రాకరాక వచ్చారు ఏమైనా తీసుకోండి' అని వారిని అడిగారు. దీంతో సీఐడీ అధికారులు నవ్వుతూ తిరస్కరించారు. అప్పటికే తనకు వాట్సాప్ లో నోటీస్ కాపీ వచ్చిందని లోకేశ్ చెప్పగా, తాము ఉదయమే ఢిల్లీ రావడంతో ఫిజికల్ కాపీ కూడా ఇచ్చి వెల్దామని వచ్చినట్లు సీఐడీ అధికారులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)