పిల్లలకు ఖర్జూరం పాలు కలిపి ఇస్తే వారు స్ట్రాంగ్ గానే కాకుండా ఆరోగ్యంగా కూడా తయారవుతారు. ఉదయం, రాత్రి రెండు పూటలా వారికి ఖర్జూరం కలిపిన పాలు ఇవ్వడం వల్ల యాక్టీవ్ గా కూడా ఉంటారు. అంతే కాకుండా ఖర్జూరం పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఖర్జూరాన్ని నానబెట్టి పాలలో మిక్సీ చేసి అయినా ఇవ్వొచ్చు. లేదా పాలలో ఖర్జూరాన్ని ఉడికించి అయినా పిల్లలకు ఇవ్వవచ్చు. ఖర్జూరం కలిపిన పాలను వారు ఇష్టపడక పోతే బనానా వేసి మిల్క్ షేక్ చేయవచ్చు. ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతారు. ఖర్జూరంలో ఐరన్, పాలలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య దరి చేరదు. చాలా మంది పిల్లలు రక్త హీనతతో బాధ పడుతూంటారు. రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు ఖర్జూరం మిల్క్ ఇస్తే ఆ సమస్య త్వరగా తగ్గుతుంది. ఆడ పిల్లలకు చిన్న వయసులోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. నెలసరి సమయంలో వారికి కూడా రక్త స్రావం అధికంగా అవుతుంది. దీంతో బలహీనంగా, నీరసంగా ఉంటారు. కొంత మందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి ఆడ పిల్లలకు ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల పై సమస్యలన్నింటి నుంచి బయట పడొచ్చు.
ఖర్జూరం పాలు - ప్రయోజనాలు
September 30, 2023
0