ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమే !

Telugu Lo Computer
0


లోక్ సభ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికలకు ఇండియా కూటమి ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోడీ సర్కారుపై విమర్శలు చేశారు. ఇండియా కూటమి ఐకమత్యంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన తాము సిద్ధంగా ఉన్నామని నితీష్ కుమార్ చెప్పారు. ఇండియా కూటమి ఐక్యమత్యంగా పోరాడుతుందని, ప్రజల కోసమే తమ కూటమి అని తెలిపారు. పార్లమెంట్‌లో జరిగే ప్రత్యేక సమావేశాలపై నితీశ్‌ మాట్లాడారు. సెషన్‌ ఎజెండా స్పష్టంగా లేదన్నారు. జేడీ(యూ)కు చెందిన 16 మంది ఎంపీలు కీలక అంశాలను సమావేశాల్లో లెవనెత్తుతారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నితీశ్‌తో పాటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ కూడా పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)