ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళను కించపరిచేలా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడారు. తదుపరి చేపట్టే చంద్రయాన్-4 మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని వ్యంగ్యంగా అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పైకి లేచిన ఒక మహిళ తమకు ఉపాధి కోసం ఫ్యాక్టరీ కావాలని అడిగింది. దీనికి సమాధానంగా తదుపరి చేపట్టే చంద్రయాన్-4 మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వ్యంగ్యంగా అన్నారు. ఆపై కూర్చోవాలని ఆమెకు చెప్పారు. ఈ సంఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. హర్యానా సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి కోసం ఫ్యాక్టరీ కోరడమే ఆ మహిళ చేసిన ఏకైక నేరమా? అని ప్రశ్నించింది. ఇలాంటి సీఎం ఉండటం సిగ్గుచేటని విమర్శించింది. సేవ చేసేందుకు ప్రజల చేత ఎన్నికైన వారే ప్రజలను ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టింది. మోదీ స్నేహితులైన కోటీశ్వరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇదే డిమాండ్ చేసి ఉంటే ఖట్టర్ వారిని ఆలింగనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం మొత్తాన్ని వారి సేవలో ఉంచేవారని ఆప్ మండిపడింది. అలాగే సీఎం ఖట్టర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళను కించపరిచేలా మాట్లాడిన హర్యానా సీఎం !
September 07, 2023
0
Tags