మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లా, మన్‌గావ్ తాలూకాలో ఉన్న ఐఎన్టీ ఇంగ్లీష్ స్కూల్‌లో జావెలిన్.త్రో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విద్యార్థి తలలోకి జావెలిన్ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 15 ఏళ్ల విద్యార్థి హుజేఫా దవారే మృతి చెందాడు. జావెలిన్ త్రో కోసం గ్రౌండ్‌లో ఉన్న హుజేఫా .. కిందకు వంగి తన షూ లేస్ కట్టుకుంటున్న సమయంలో మరో విద్యార్థి ప్రాక్టీస్‌లో భాగంగా జావెలిన్‌ను విసిరాడు. అయితే ఆ జావెలిన్ నేరుగా వచ్చి షూ లేస్ కట్టుకుంటున్న విద్యార్థి తలలోకి దిగింది. జావెలిన్ తలలోకి దిగగానే.. ఆ విద్యార్థి అక్కడే కూలిపోయాడు. బ్లీడింగ్ అవుతున్న అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం జరగలేదు. గోరేవాగ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జావెలిన్ తలలోకి దిగి విద్యార్థి మృతి !
September 07, 2023
0
Tags