ట్రాఫిక్‌లోనే కూరగాయలు తరిగిన మహిళ !

Telugu Lo Computer
0


బెంగళూరులో ట్రాఫిక్‌ ను దాటుకొని తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు నగర ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ కారణంగా సకాలంలో తమ పనులను పూర్తి చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. వారి కష్టాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ఒక మహిళా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా  తన సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. ప్రియా అనే మహిళా ఒకవైపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినా మరోవైపు వాహనంలో కూర్చోని ఎంచక్కా కూరగాయలను తరిగేసుకున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ''ఒకవేళ హైడ్రోపోనిక్స్‌ ఫామ్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో మొక్కలను తీసువెళ్తే ట్రాఫిక్‌ను దాటే లోపే అవి పెరిగిపోతాయేమో'' అని ఒకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ''ఈ పోస్టును నా బాస్‌కు పంపుతాను'' అని మరొకరు పోస్టు చేశారు. ''ఆలోచన బాగుంది. ఇకపై ట్రాఫిక్‌ కారణంగా మన పనులను వాయిదా వేసుకునే అవసరం ఉండదు'' అని పోస్టు పెడుతున్నారు. గతంలో ఒక వ్యక్తి ట్రాఫిక్‌లో ఉన్న కూడా తన భోజనాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)