కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా హునగుండ తాలూకా అమీనగర్ పట్టణంలో ఆదివారం రాత్రి గైబుసాబ్ ముల్లా అలియాస్ ముల్లా (34) అనే వ్యక్తి హత్యకు గురైనాడని, ముస్తాక్ జంగి (20) అనే యువకుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అమీనగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి ముల్లా హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు.తనకు ఎగ్ రైస్, కబాబ్ కావాలని ముల్లాను ముస్తాక్ అడిగాడు. అప్పటికే రాత్రి చాలా ఆలస్యం కావడంతో ఎగ్ రైస్, చికెన్ కబాబ్‌లు అన్నీ అమ్ముడుపోయాయని, ప్రస్తుతానికి ఓ ముక్క కబాబ్ కూడా లేదని హోటల్ యజమాని ముల్లా, ముస్తాక్ కు చెప్పాడు. దానితో ముస్తాక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ముస్తాక్ తిరిగి హోటల్ వద్దకు వచ్చి కత్తితో ముల్లా మెడపై పొడిచి హత్య చేశాడు. నిందితుడు ముస్తాక్ గతంలో పలువురిపై దాడి చేసి జైలుకు వెళ్లాడని, ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ వార్త తెలియగానే అమీన్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి హత్య చేసిన నిందితుడు ముస్తాక్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
హోటల్ యజమాని ప్రాణం తీసిన చికెన్ కబాబ్ !
September 18, 2023
0
Tags