సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు - సమానంగా చూడండి !

Telugu Lo Computer
0


నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఆ చర్చలో డీఎంకే నేత కనిమొళి పాల్గొని మాట్లాడారు. బిల్లులో ఉన్న వందనం అన్న పదాన్ని ఆమె తప్పుపట్టారు. వందనం అంటే సెల్యూట్ అని, తమకు ఎవరూ సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కానీ మహిళల్ని సమానంగా చూస్తే సరిపోతుందని కనిమొళి అన్నారు. బలమైన, శక్తివంతమైన మహిళను ఎందుకు దయ్యంలా చూస్తారని ఆమె ప్రశ్నించారు. కాళీ దేవతను ఎందుకు అవమానించేందుకు వాడుతుంటారని ఆమె అడిగారు. భారతీయ చరిత్రలో ఎంతో మంది శక్తివంతమైన మహిళా నేతలు ఉన్నారని, ఆ జాబితాలో ఇందిరా గాంధీ, జయలలిత, సుష్మా స్వరాజ్ ఉన్నట్లు ఆమె చెప్పారు. అన్నాడీఎంకే నేత జయలలిత కూడా శక్తివంతమైన నేత అని కనిమొళి అనడంతో సభలో బీజేపీ సభ్యులు అరిచారు. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాతే రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని రాజ్యాంగం సూచిస్తుందని, కానీ భారత్‌లో దశాబ్ధ కాలం నుంచి జనాభా లెక్క జరగలేదని, కేవలం జనాభా ఆధారంగానే డీలిమిటేషన్ జరిగితే, అప్పుడు అన్యాయం జరిగినట్లు అవుతుందని ఆమె అన్నారు. ఎందుకు రహస్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చినట్లు ఆమె ప్రశ్నించారు. మంత్రులతో ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండానే.. అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎవరికీ చెప్పకుండా బిల్లును ప్రవేశపెట్టడంలో ఉన్న తొందర ఏమిటని ఆమె ప్రశ్నించారు. 2010లో యూపీఏ సర్కార్ ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ఈ అంశం గురించి మాట్లాడానని, మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు లోక్‌సభలో అదే బిల్లుపై మాట్లాతున్నట్లు ఆమె వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)