లోయర్ బెర్త్‌లు వికలాంగులకే !

Telugu Lo Computer
0


భారతీయ రైల్వే కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్‌ను వికలాంగులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వికలాంగుల సౌకర్యార్ధం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డ్ ఆదేశాల ప్రకారం నాలుగు సీట్లు అంటే రెండు లోయర్, రెండు మిడిల్ సీట్లు, ఏసీ థర్డ్ క్లాస్‌లో రెండు, స్లీపర్ తరగతిలో రెండు సీట్లను వికలాంగులకు కేటాయించారు. అదే సమయంలో గరీబ్ రథ్ రైలులో రెండు లోయర్, రెండు అప్పర్ సీట్లను వికలాంగులకు కేటాయించారు. దీంతోపాటు సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ కేటాయించనున్నారు. స్లీపర్ తరగతిలో 6-7 లోయర్ బెర్త్‌లు, థర్డ్ ఏసీలో 4-5 లోయర్ బెర్త్‌లు, సెకండ్ ఏసీలో 3-4 లోయర్ బెర్త్‌లు గర్భిణీ మహిళలకు, 45 ఏళ్లు పైబడినవారికి కేటాయిస్తారు. ఏ విధమైన ఆప్షన్ లేకుండానే వారికి ఈ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు టికెట్ ఒకవేళ సీనియర్ సిటిజన్, గర్బిణీ లేదా దివ్యాంగులు అప్పర్ సీట్‌లో ఉంటే టీటీ వారికి లోయర్ బెర్త్ కేటాయించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)