ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత చంద్రబాబుని జైల్లోకి తీసుకెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గాన పోలీసులు చంద్రబాబును తరలించారు. విజయవాడ నుంచి రాజమండ్రికి చేరుకోవడానికి ఐదు గంటలకుపైగానే సమయం పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకోసం జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని అధికారులు సిద్ధం చేశారు. జైలు అధికారులు చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు వద్ద దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వెంటే నారా లోకేశ్, తెదేపా నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. నారా లోకేశ్ ను మాత్రమే జైలు లోపలికి అనుమతించారు. పేపర్ వర్క్ ప్రక్రియ పూర్తికావడంతో జైలు నుంచి లోకేశ్ వెళ్లిపోయారు.
రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు
September 11, 2023
0
Tags