భక్తి ఉన్న చోట అభివృద్ధి, ఆనందం ఉంటుంది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌, 600 ట్రక్ పార్కింగ్‌ టెర్మినల్‌, కవర్డ్‌ స్టోర్‌ షెడ్‌ను కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనోవాల్‌ మాట్లాడుతూ విశాఖ పోర్టు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ''సాగరమాల కార్యక్రమంలో భాగంగా పోర్టులను ఆధునీకరిస్తున్నాం. పోర్టుల కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి చేపట్టాం. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో టెర్మినల్‌ సేవలు ప్రారంభించాం. విశాఖలో కాలుష్యం నియంత్రించే ప్రక్రియ చేపట్టాం. కాలుష్య నియంత్రణలో భాగంగానే కవర్డ్‌ స్టోరేజ్‌ షెడ్‌ను ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్‌ సహజ వనరులు కలిగిన రాష్ట్రమని, ఇక్కడ ప్రజలకు  భక్తి ఎక్కువ, భక్తి ఉన్న చోట అభివృద్ధి, ఆనందం ఉంటుంది'' అని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)