హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరుచురాపల్లి-శ్రీ గంగానగర్‌ మధ్య నడిచే హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు చెలరేగాయి. ఇది వల్సాడ్‌ స్టేషన్‌ సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలుకు చెందిన బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేశారు. సమాచారం అందడంతో వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)