మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన 'కార్యకర్త మహాకుంభ్' లో మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని బీమారు రాజ్యంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని యువత చురుగ్గా ఆలోచించి అవినీతీ, అక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించారని, రానున్న అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి మళ్లీ అదే గతి పట్టించాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ ని ఆశీర్వదించారని కోరారు. కాంగ్రెస్ హయాంలో పేదరికం పెరిగిపోతే.. బీజేపీ వచ్చాక సుమారు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని.. ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మహిళా బిల్లును ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. బీజేపీ నిర్వహించిన కార్యకర్త మహాకుంభ్ గురించి ఆయన మాట్లాడుతూ సభకు వచ్చిన జనం చూస్తుంటే బీజేపీ కార్యకర్తల సత్తా ఏంటో తెలుస్తోందని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ దేశానికి గుండె కాయఅని సరైన అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భోపాల్‌లోని జంబోరీ మైదాన్‌లో నిర్వహించిన 'కార్యకర్త మహాకుంభ్' బీజేపీ 'జన్ ఆశీర్వాద యాత్రల' అధికారిక ముగింపు సభగా నిలిచింది. గతంలో రాష్ట్రంలో నిర్వహించిన ఆరు పర్యటనల సందర్భంగా, మోడీ 22 జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలను కవర్ చేశారు. పేదరికం, దళితులు, గిరిజనులు తదితర అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రస్తావించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు వంటి అంశాలను ఎత్తిచూపుతూ ఆయన ప్రసంగాలు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని సాగాయి.
కాంగ్రెస్ 'బీమారు రాజ్యం'గా మార్చింది
September 25, 2023
0
Tags