ఆంటీ అన్నందుకు సెక్యూరిటీ గార్డును చెప్పుతో కొట్టిన మహిళ !

Telugu Lo Computer
0


బెంగళూరులో అశ్వినీ అనే మహిళ డబ్బు డ్రా చేసుకోడానికి ఏటీఎం దగ్గరికి వచ్చింది. డబ్బులు డ్రా చేసుకోని డోర్ దగ్గర నిల్చుని ఉన్న ఆమెను సెక్యూరిటీ గార్డు కృష్ణయ్య కాస్త పక్కకు జరగండి ఆంటీ అని అనగా, ఆమె ఆగ్రహాంతోఊగిపోయింది. దీంతో తన చెప్పుతో సెక్యూరిటీని చెంపదెబ్బ కొట్టింది. అతనిపై శారీరకంగా దాడి చేయడమే కాకుండా తీవ్ర పదజాలంతో కూడా దూషించింది. అశ్వినిపై కృష్ణయ్య మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కాసేపటికే ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. ఈ ఘటనలో సెక్యూరిటీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)