ఖర్గేకు అందని ఆహ్వానం !

Telugu Lo Computer
0


జి20 ప్రతినిధులకు శనివారం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన అధికార విందు కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. క్యాబినెట్‌ హోదా కలిగిన వ్యక్తి, దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అయిన ఖర్గేకు ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరే ఇతర పార్టీ నేతలకు కూడా ఆహ్వానం అందలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్‌, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులకు ఈ డిన్నర్‌కు ఆహ్వానం అందింది. భారత ప్రభుత్వ కార్యదర్శులు, పారిశ్రామిక వేత్తలతో సహా ఇతర ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, హెచ్‌.డి. దేవగౌడలకు కూడా ఆహ్వానం అందింది. బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌, జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సోరెన్‌, పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, తమిళనాడు సిఎం ఎం.కె. స్టాలిన్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సహా పలువురు ముఖ్యమంత్రులను ఈ విందుకు ఆహ్వానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)