హోంగార్డు రవీందర్ మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని గోషామహల్‌లో నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్ హోంగార్డు ఎం రవీందర్ మృతి చెందాడు. అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సకాలంలో జీతం అందకపోవడం, ఉన్నతాధికారుల వేధింపులకు మనస్తాపం చెందిన రవీందర్.. ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ కమాండెంట్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60 శాతానికి పైగా తీవ్రంగా గాయపడిన అతడ్ని మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కాంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం ఉదయం రవీందర్ మృతి చెందాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)