డీజిల్ వాహనాలు తయారీ చేస్తున్న కంపెనీలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. డీజిల్ కార్లపై అదనంగా పది శాతం జీఎస్టీని విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో డీజిల్ కార్ల ధరలకు మరింత రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్యాక్స్‌ను పెంచడం వల్ల ఆ కంపెనీలు తమ డీజిల్ కార్లను అమ్మడంలో ఇబ్బంది పడుతాయని కేంద్ర మంత్రి అన్నారు. డీజిల్ వాహనాలకు త్వరగా గుడ్‌బై చెప్పాలని, లేదంటే ఆ వాహనాలపై పన్ను శాతాన్ని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం అధికం అవుతోందని, అందుకే పది శాతం అధిక పన్ను వేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖకు ప్రపోజల్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడుతున్నట్లు మంత్రి తెలిపారు. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన చేసిన నేపథ్యంలో టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, అశోక్ లేలాండ్ కంపెనీల షేర్లు పడిపోయాయి.
డీజిల్ వాహనాల తయారీకి గుడ్‌బై చెప్పండి !
September 12, 2023
0
Tags