చంద్రబాబు అరెస్ట్‌ చట్ట విరుద్ధం !

Telugu Lo Computer
0


తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖండించారు. అరెస్టు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలను తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని అఖిలేష్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారిందన్నారు. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ , వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)