లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రీమియం చెల్లించలేక, పాలసీని డిస్‌కంటిన్యూ చేసిన వారికి ఒక అవకాశం కల్పిస్తోంది. ఆ పాలసీని మళ్లీ పునరుద్ధరించుకోవడానికి ఒక ఛాన్స్ అందిస్తోంది. దీని ద్వారా ఎవరైతే పాలసీ ప్రీమియం కట్టకుండా పాలసీ నుంచి తప్పుకున్నారో అలాంటి వారు మళ్లీ ఇప్పుడు వారి పాలసీని యాక్టివ్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ ఇలాంటి వారికి ప్రత్యేకమైన రాయితీ కల్పిస్తోంది. ఈ అవకాశం మాత్రం పరిమిత కాలం వరకే ఉంటుంది. అంటే అక్టోబర్ నెల చివరి వరకు ల్యాప్స్ అయిన పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అందువల్ల మీరు మీ ఎల్ఐసీ పాలసీని మళ్లీ పునరుద్ధరించుకోవాలని భావిస్తే.. వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే మాత్రం తర్వాత మీరు పాలసీని మళ్లీ యాక్టివేట్ చేసుకోలేరు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ నిలిచిపోయిన ఎల్ఐసీ పాలసీలను పునరుద్ధరించుకోవాలని భావించే వారికి లేట్ ఫీజులో రాయితీ అందిస్తోంది. అయితే పాలసీ ప్రీమియం చెల్లించడం ఆపేసిన దగ్గరి నుంచి ఐదేళ్లు దాటని వారు మాత్రమే వారి పాలసీని పునరుద్ధరించుకునే అవకాశం కలిగి ఉంటారు. అందుకే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పాలసీ ఆగిపోయి ఐదేళ్లు దాటితే అలాంటి పాలసీలను తిరిగి పొందలేరు. పాలసీని తిరిగి కొనసాగించాలని భావించే వారికి చెల్లించాల్సిన ప్రీమియం ఆధారంగా ఆలస్య రుసుములో వచ్చే రాయితీ కూడా మారుతుంది. రూ. లక్ష వరకు ప్రీమియం చెల్లించాల్స ఉంటే.. వారికి లేట్ ఫీజులో 30 శాతం రాయితీ వస్తుంది. గరిష్టంగా రూ.3 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.1,00,001 నుంచి రూ. 3 లక్షల వరకు ప్రీమియం చెల్లించాల్సిన వారికి కూడా లేజ్ ఫీజులో 30 శాతం రాయితీ ఉంటుంది. గరిష్టంగా రూ.3,500 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.3,00,001 నుంచి ఆపైన మొత్తాన్ని ప్రీమియం రూపంలో కట్టాల్సి ఉంటే అలాంటి వారికి లేట్ ఫీజులో రూ.4 వేల తగ్గింపు ఉంటుంది.
ఆగిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి అవకాశం కల్పించిన ఎల్ఐసీ !
September 26, 2023
0
Tags