ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం

Telugu Lo Computer
0


సియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం. మరోవైపు, సెయిలింగ్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సెయిలింగ్‌లోనే మరో రెండు పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల విభాగంలో రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఎబాద్‌ అలీ ఆర్‌ఎస్ - X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్‌సీఏ విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య పతకాలు సాధించారు. భారత బాక్సర్ సచిన్‌ అదరగొట్టేశాడు. దీంతో రెండో రౌండ్‌లోకి ఎంటరయ్యాడు. 57 కేజీల విభాగంలో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్‌పై 5-0 ఆధిక్యంతో విజయం సాధించాడు. ఇక 92 కేజీల విభాగంలో 16వ రౌండ్‌లో కర్గిస్థాన్‌ బాక్సర్ ఒముర్‌బెక్‌తో భారత బాక్సర్ నరేంద్ర తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంక్ అగర్వాల్ స్ట్రీట్‌ ఫైటర్ నాకౌట్‌ రౌండ్ల నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. భారత ఈక్వెస్ట్రియన్‌ ఈవెంట్‌లో ప్రస్తుతం భారత అథ్లెట్‌ హృదయ్ విపుల్ (69.941) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హాంకాంగ్‌కు చెందిన జాక్వెలిన్ వింగ్‌ యింగ్‌ (71.176) అగ్రస్థానంలో ఉన్నాడు. టెన్నిస్‌లో సుమిత్‌ నగల్‌ మూడో రౌండ్‌లో తలపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)