మధ్యప్రదేశ్లో ఓ కార్యక్రమంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ కొత్త కూటమిని ఏర్పాటు చేసిందని, దీనికి ఇండియా అని పేరు పెట్టారన్నారు. అయితే వారు కూటమిని రూపొందించాక భారతదేశంగా మారాము అని చెప్పడం ప్రారంభించారని, ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో భాగమేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఇండియా అని పేరు పెట్టారని అన్నారు. నేను రేపు మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటే నేను మహాత్మా గాంధీని కాగలనా ? నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు తీసుకుంటే నేను నేతాజీ అవుతానా అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై మాట్లాడుతూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన్‌ను మలేరియాగా అభివర్ణించారని, ఎ. రాజా హిందూ మతం ఒకటే అన్నారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ హిందూ మతానికి హోదా లేదని అన్నారని బిస్వా శర్మ పేర్కొన్నారు. భారతదేశంలో ఏ అభివృద్ధి జరిగినా అది హిందువుల వల్లనే అని బిశ్వ శర్మ అన్నారు. రాహుల్ గాంధీ స్నేహితులు సనాతన్ ను మలేరియా, ఎయిడ్స్ అని అంటుంటే వారిని కూటమి నుండి తప్పించువచ్చు కదా అని ప్రశ్నించారు.
ఇండియా కూటమిపై హిమంత బిస్వా శర్మ విసుర్లు !
September 16, 2023
0
Tags