ఢిల్లీ నగరంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతి దుర్మరం పాలైంది. రెండు బస్సుల మధ్య తల ఇరుక్కుని నలిగిపోవడంతో ఆమె మృత్యువాతపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన బాబ్లీ అనే 20 యేళ్ళ యువతి తన సోదరి, ఆమె భర్త, వారి ముగ్గురు పిల్లలతో కలిసి లుథియానా వెళ్లేందుకు కాశ్మీర్ గేటు వద్ద హర్యానా రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎక్కారు. బస్సుఅలీపూర్ ప్రాంతానికి చేరుకోగానే, ఆ యువతికి వాంతి రావడంతో కిటికీలోంచి తల బయటపెట్టింది. అదేసమయంలో మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండటంతో రెండు బస్సుల మధ్య ఆమె తల నలిగి దుర్మరణం చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండో బస్సు కోసం గాలిస్తున్నారు.
రెండు బస్సుల మధ్య తల ఇరుక్కుని యువతి మృతి
August 31, 2023
0
Tags