బీహార్ లోని పాట్నాలో పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి సీఎం కాన్వాయ్ కు పోలీసులు దారిచ్చారు. రోగి పరిస్థితి సీరియస్ గా ఉందని, అంబులెన్స్ కు దారివ్వాలని కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు వినలేదు. సీఎం కాన్వాయ్ వెళ్లేవరకు అంబులెన్స్ ను నిలిపేశారు. ఈ ఘటనను డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. వీడియోలో ఆ రోగి కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి ప్రాణాలతో పోరాడుతూ ఉండగా.. కుటుంబ సభ్యులు ఏడుస్తున్నా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ కనీస మానవత్వం ప్రదర్శించలేదని మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై అటు పోలీసులు, ఇటు సీఎం నితీష్ ఇంతవరకు స్పందించలేదు.
సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపిన పోలీసులు !
August 22, 2023
0
Tags