ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం దృవీకరించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా, 1949 జూన్ 5న తూప్రాన్‌లో జన్మించిన గద్దర్.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. ఉద్యమంలో తన పాటతో ఎంతోమందిని ఉత్తేజపరిచారు.
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
August 06, 2023
0
Tags