స్మృతి ఇరానీని మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని సోషల్ మీడియాలో ఒకరు అడిగారు. దానికి మోనా నాకన్నా 13 ఏళ్ళు పెద్దది. అలాంటప్పుడు తను నా ఫ్రెండ్ ఎలా అవుతుంది. రాజకీయనాయకురాలు కూడా కాదు. కాబట్టి ఆమెను ఇందులోకి లాగొద్దు అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. ఒక అమాయకురాలి గౌరవానికి భంగం వాటిల్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీకు ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి, కావాలంటే పోరాడండి అని కూడా చెప్పారు. టీవీ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన స్మృతి ఇరానీ రాజకీయ నాయకురాలిగా ఎదిగి ప్రస్తం కేంద్రమంత్రి పదవి హోదాలో ఉన్నారు. 2001లో స్మృతి జుబిన్ ఇరానీనీ పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు అంతకు ముందే మోనా అనే ఆమెతో వివాహం అయి విడిపోయారు. స్మృతి, జుబిన్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి !
August 14, 2023
0
Tags