చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్‌-3 !

Telugu Lo Computer
0


చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. దీంతో చంద్రుడుకి, వ్యోమనౌకకు మధ్య దూరం మరింత తగ్గింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 16వ తేదీన ఉదయం 8.30కి చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. తద్వారా అంతరిక్ష నౌక చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరనుంది. తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరుపడనుంది. ఆ తర్వాత ఈనెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది. అంతా సజావుగా జరిగి, సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే రోవర్ తన పని ప్రారంభించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)