కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో కుకనూర్ తాలుకా, కొలిపేట్ పట్టణం భానాపూర్ గ్రామంలో ముస్లింలు ఇటగి మసీదును నూతనంగా నిర్మించారు. స్థానిక ముస్లిం నాయకులు మసీదును హిందూ స్వామీజీలచే ప్రారంభించాలని భావించారు. ఈ క్రమంలోనే యలబుర్గా శ్రీధర్ మురుడి మఠానికి చెందిన బసవలింగ శివాచార్య స్వామీజీ, కుకనూరు అన్నదానేశ్వర శాఖామఠానికి చెందిన మహాదేవయ్య స్వామీజీని వారు ఆహ్వానించారు. ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న స్వామిజీలు మసీదును ప్రారంభించారు. అనంతరం హిందూ సంఘాల నాయకులు స్వామీజీల పాదాలు కడిగి, పాదాభివందనం చేశారు. ముస్లిం సంఘాల నాయకులు స్వామీజీల పాదాలు కడిగేందుకు నీరు అందించారు. అలాగే స్వామిజీలకు హారతి ఇచ్చేందుకు సహకరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. "మన ప్రవర్తనలు యువ తరానికి ఆదర్శంగా ఉండాలి. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది'' అని బసవలింగ శివాచార్య స్వామీజీ అన్నారు. మహదేవయ్య స్వామీజీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు, ముస్లింలు సామరస్య భావాన్ని పెంపొందించుకుని అన్ని పండుగలను శాంతియుతంగా జరుపుకోవడం గర్వకారణం అన్నారు. "ముస్లిం సమాజం శాంతి, సామరస్యాన్ని కోరుకుంటుంది. కుకనూరులో మేమంతా అన్నదమ్ముల్లా ఉన్నాం. అందుకే మసీదు ప్రారంభోత్సవానికి స్వామీజీని ఆహ్వానించాం'' అని ముస్లిం సంఘం నాయకుడు ముహమ్మద్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు నాయకులు మహ్మద్ అలీ, ఫకీరప్ప చందూర్, బసవరాజ ఆర్య, మౌలాసాబ్ మక్కందర, హుస్సేనాబ్ చోకలి, దూదపీర్ సాబ్ అలీసాబ్, నూర్ అహ్మద్ కొప్పాల, రామన్న మండలమాని, మల్లప్పామి చోకలి, మల్లయ్యప్ప వల్కీ, మల్లయ్యప్ప చోకలి, మౌలాదియాబ్, మల్లయ్యప్పామి, మల్లయ్యప్ప చోకలి, ఉభయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. https://t.me/offerbazaramzon
కర్ణాటకలో మసీద్‌ను ప్రారంభించిన స్వామీజీలు !
July 26, 2023
0
Tags