1984 ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్ కు ఢిల్లీ కోర్టు బుధవారంనాడు సమన్లు పంపింది. ఆగస్టు 5న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో నమోదైన ఛార్జిషీటును పరిగణలోకి తీసుకుని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విధి గుప్తా ఆనంద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో జగదీష్ టైట్లర్‌పై మే 20న సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. ఢిల్లీలోని పూల్ బంగస్ ఏరియాలో 1984 నవంబర్ 1వ తేదీన అల్లరి మూకలు విరుచుకుపడి ముగ్గురు సిక్కులను హత్య చేయడంతో పాటు ఒక గురుద్వారాకు నిప్పుపెట్టారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె సొంత బాడీగార్డులు హత్య చేసిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. అజాం మార్గెట్‌లోని పుల్ బంగస్ గురుద్వారా వద్ద గుమిగూడిన ప్రజలను జగదీష్ టైట్లర్ రెచ్చగొట్టడంతో ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. ఈ అల్లర్లలో గురుద్వారా తగులబడటంతో పాటు ఠాకూర్ సింగ్, బాదల్ సింగ్, గురుచరణ్ సింగ్‌లు హత్యకు గురయ్యారని తెలిపింది. జగదీష్ టైట్లర్‌పై ఐపీసీ సెక్షన్ 147, 109, 302 కింద అభియోగాలు నమోదు చేసింది. https://t.me/offerbazaramzon
జగదీష్ టైట్లర్‌కు సమన్లు !
July 26, 2023
0
Tags