29 సంవత్సరాల యువతి ఇంటర్నెట్‌లో చేసిన ఓ పోస్టు సంచలనం రేపుతోంది. నెటిజన్లు చాలా ఉత్సాహంగా స్పందిస్తున్నారు. బికామ్ చదువుకున్న ఆ యువతి ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయట్లేదట. ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా 14 మంది పురుషులతో పరిచయం జరిగిందట. అయితే వారిలో ఎవరిని చేసుకోవాలో అర్ధం కావట్లేదుట. @TheSquind అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయబడిన పోస్టులో 'నా వయసు 29 సంవత్సరాలు, బీకామ్ చదువుకున్నాను. ప్రస్తుతానికి పని చేయడం లేదు. నేను మ్యాట్రిమోనీ ద్వారా 14 మంది అబ్బాయిలతో మాట్లాడుతున్నాను.. అయితే ఎవరిని ఎంచుకోవాలో అయోమయంలో ఉన్నాను' అని పేర్కొంది. వారి జీతాలు, వారు పనిచేసే సంస్థల వివరాలు అందులో తెలిపింది. ఆమె పెట్టిన వివరాల ప్రకారం వారి ఆదాయం సంవత్సరానికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ఉంది. ఇక వారంతా బైజూస్, ఫ్లిప్ కార్ట్, డెలాయిట్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీల్లో పని చేస్తున్నారు. ఐ పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. 'డిగ్రీ పూర్తి చేసిన మీరు ఉద్యోగంలో ఎందుకు లేరని' కొందరు ప్రశ్నించారు. 'మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో పురుషులు కూడా చాలామంది మహిళలతో టచ్ లో ఉండటం సాధారణమని అయితే మాటల్లో వారి నిజాయితీని తెలుసుకోవాలని' సూచించారు. ఏది ఏమైనా భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఓ యువతి ధైర్యంగా నెటిజన్ల సలహా అడగటం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. https://t.me/offerbazaramzon
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి పోస్టు !
July 20, 2023
0
Tags