కొండచరియలు విరిగిపడి పలువురు ఆదివాసీలు మృతి !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఖలాపుర్‌ సమీపంలోని కొండప్రాంతంలో బుధవారం రాత్రి భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పలువురు ఆదివాసీలు మృతి చెందారు.  అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఇర్సల్‌వాడి కొండపై ఉన్న గ్రామంలోని 30 ఇళ్లపై మట్టిపెళ్లలు, కొండరాళ్లు పడ్డాయి. దీంతో గృహాలు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం 15 నుంచి 20 మంది మృతి చెంది ఉండవచ్చని సీఎం ఏక్‌నాథ్‌ శిండే వెల్లడించారు. దాదాపు 100 మంది శిథిలాల కింద చిక్కుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల్లో గ్రామానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో కాలి నడకనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాదాపు 75 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలతో పాటు ముంబయి నుంచి నౌకాదళ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ''బాధితులను రక్షించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం నుంచి దాదాపు 100 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానికులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా సాయం తీసుకుంటున్నాం'' అని రాయ్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రాయ్‌గఢ్‌, పాల్‌ఘర్‌ జిల్లాలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ రాష్ట్రం అంతటా 12 బృందాలను ఏర్పాటు చేసింది. రాయ్‌గఢ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌, సాంగ్లీ, నాగ్‌పూర్‌, థానే జిల్లాలో ఒక్కో బృందాన్ని మోహరించింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)