విచారణ కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తోంది !

Telugu Lo Computer
0


రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని మహిళా రెజ్లర్లు ధ్వజమెత్తారు. విచారణ కమిటీ బ్రిజ్‌భూషణ్‌ను రక్షించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. బిజెపి ఎంపి కూడా అయిన బ్రిజ్‌ భూషణ్‌ పట్ల విచారణ కమిటీ పక్షపాతం చూపుతోందని ఫిర్యాదు దారులు ఓ ప్రకటనలో తెలిపారు. 1599 పేజీలతో కూడిన చార్జిషీటులో 44 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. సిఆర్‌పిసి 164 కింద ఫిర్యాదుదారుల ఆరు వాంగ్మూలాలు కూడా తీసుకుంది. తాను ఫెడరేషన్‌ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా కమిటీ ముందు తన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా, నిందితులు తన పట్ల గతంలో మాదిరిగానే వ్యవహరించారని ఓ ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అసహ్యకరమైన, కామపు చూపులతో, తనకు అభద్రతాభావాన్ని కలిగించేలా సంజ్ఞలు చేశారని అన్నారు. తాను వాంగ్మూలం ఇచ్చే సమయంలో వీడియో రికార్డింగ్‌ను స్విచ్ఛాప్‌ చేశారని, తనకు కాపీ కూడా ఇవ్వలేదని అన్నారు. తన వాంగ్మూలాన్ని పూర్తిగా రికార్డు చేయలేదని, నిందితుని కాపాడే ఉద్దేశంతో సాక్ష్యాన్ని మార్చే అవకాశం కూడా ఉందని అన్నారు. కోర్టు సమన్ల మేరకు బ్రిజ్‌ భూషణ్‌, ఫెడరేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌లు మంగళవారం ట్రయల్‌ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ప్యానెల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది కానీ బహిరంగపరచకపోవడం గమనార్హం. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)