విపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం !

Telugu Lo Computer
0


పోర్ట్‌ బ్లెయిర్‌లో వీరసావర్కర్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను మంగళవారం వర్చువల్‌గా ఢిల్లీ నుంచే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేశాయని, ప్రతీకార రాజకీయాలకు పాల్పడ్డాయని విమర్శించారు. యూపీఏ హయాంలో జరిగిన తప్పులను తాము సరిదిద్దామన్నారు. అలా చేయడం వల్లే ఈ తొమ్మిదేళ్లలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేస్తున్నాయన్న ప్రధాని మోడీ, గతంలో వాళ్లు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి అనే మాటెత్తకుండా. స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది.. కానీ కుటుంబ రాజకీయాలను ప్రొత్సహించే పార్టీల్లో.. కుటుంబాల కోసం.. కుటుంబాల చేత, కుటంబాల కొరకే అని ఉంటుందన్నారు. దేశం కోసం వాళ్లేం చెయ్యలేరని.. విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే ఉంటాయన్నారు. కేవలం వాళ్ల కుటుంబాలే ఎదగాలనుకుంటున్నాయి తప్ప.. పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చెయ్యరటూ విపక్షాలపై మండిపడ్డారు. దేశ ప్రజలు 2024లో తిరిగి తమనే అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారని .. అందుకే వారు బెంగళూరు చేరి తమ​ దుకాణాలు తెరచుకున్నారని ఎద్దేవా చేశారు. 24 కే లియే 26 హోనే వాలే రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్ తా హై  అంటూ పాటలు పాడుతున్నారని.. కానీ వాస్తవం మరోలా ఉందని ప్రధాని మోడీ అన్నారు. వాళ్ల దుకాణాల వద్ద కులతత్వమనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే ఉంటాయని ప్రధాని ఎద్దేవా చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)