ఎన్‌డీఏలో చేరనున్న ఎస్‌బీఎస్‌పీ

Telugu Lo Computer
0


ఎన్‌డీఏలో సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చేరనుంది. ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఎస్‌బీఎస్‌పీ.. ఫలితాలు వెలువడిన కొన్ని నెలలకే ఆ పొత్తు నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా రాజ్‌భార్ న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన ఒక రోజు తర్వాత.. తమ పార్టీ ఎన్టీఏలో చేరుతున్నట్టుగా ప్రకటన చేశారు. ఈ పరిణామం రాజకీయంగా కీలకమైన తూర్పు యూపీ ప్రాంతంలో ఓబీసీలలో బీజేపీ తన బలమైన స్థావరాన్ని పటిష్టం చేయడంలో సహాయపడుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో ఎస్‌బీఎస్‌పీ చేరికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఓం ప్రకాష్ రాజ్‌భార్‌తో భేటీ కావడం జరిగిందని.. ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారని.. ఆయనను ఎన్డీయే కుటుంబానికి స్వాగతిస్తున్నానని ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు. రాజ్‌భార్ రాకతో ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీఏ బలపడుతుందని.. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మోదీ నాయకత్వంలో ఎన్డీయే చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుందని ట్వీట్ చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)