విద్యుదాఘాతానికి గురై ఐదుగురు భక్తులు మృతి

Telugu Lo Computer
0


క్షిణ ఉత్తరప్రదేశ్‌లోని మిరట్‌ జిల్లా, భవాన్‌పురీ రాలీ చౌహాన్ గ్రామంలో శివుని భక్తులుగా పేరుగాంచిన కన్వరియాలు యాత్రకు వెళ్లారు. హరిద్వార్‌లో గంగాజలంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు  భవాన్‌పురీ గ్రామానికి చేరుకోగానే కిందికి వంగి ఉన్న హై టెన్షన్ వైర్‌లకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న యాత్రికులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్రమత్తమైన గ్రామస్తులు విద‍్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కానీ అప్పటికే ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలంటూ నిరసన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు కిందికి ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిచేయలేదని ఆవేదన వ‍్యక్తం చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)