అనుకోని రీతిలో దుబాయ్‌ అధ్యక్షుడుని కలిసిన భారతీయ వ్యాపారవేత్త కుటుంబం !

Telugu Lo Computer
0


భారతీయ వ్యాపారవేత్త అనాస్‌ రెహాన్‌ జునైద్‌, అతడి కుటుంబం హాలిడే ట్రిప్‌గా దుబాయ్‌కి వెళ్లారు. ఆ కుటుంబం చక్కగా ఎంజాయ్‌ చేస్తుండగా సడెన్‌గా అనుకోని రీతిలో దుబాయ్‌ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ అతడి సహచరులని కలిశారు. ఆ కుటుంబం లిప్ట్‌లో వెళ్తుండగా సడెన్‌గా ఈ ఘటన ఎదురవ్వడం విశేషం. వారు వెళ్తున్న అదే లిఫ్ట్‌లోకి ఆ దేశ అధ్యక్షుడు అతని పరివారం వచ్చారు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయింది. సదరు వ్యాపారవేత్త ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని తన కూతుర్ని అడిగాడు. అంతేగాదు ఆ అధ్యక్షుడితో ఫోటోలు తీసుకునేందుకు అనుమతి కోరగా, నవ్వుతూ ఫోజులివ్వడమే గాక వారితో కాసేపు ముచ్చటించాడు షేక్‌. మేము నిజంగా అతన్ని కలుసుకున్నామా ఇది నమ్మలేకపోతున్నాం అంటూ భావోద్వేగానికి గురైంది ఆ కుటుంబం. షేక్‌ని కలిసేలా చేసిని ఆ లిఫ్ట్‌ తమకు ప్రత్యేకమని, ప్రపంచంలోని అన్ని లిఫ్ట్‌ల కంటే అదే మాకు ఇష్టమని చెప్పారు. ఈ మేరకు పారిశ్రమికవేత్త ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)