చర్చి ఆఫ్ హెవెన్ బ్యాంక్‌ పేరిటవృద్ధురాలిని మోసం చేసిన దుండగుడు !

Telugu Lo Computer
0


స్పెయిన్‌లోని లియోన్ ప్రాంతానికి చెందిన ఎస్పెరాన్జా అనే వృద్దురాలు నివసిస్తోంది. ఆమెకు ఓ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్వర్గంలోని ‘చర్చి ఆఫ్ హెవెన్’ అనే బ్యాంక్‌లో నువ్వు డబ్బులు డిపాజిట్ చేస్తే, నీకు రెండింతల లాభం వస్తుందని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇక ఈ ఫోన్ కాల్‌ను ఆ వృద్దురాలు సీరియస్‌గా తీసుకుంది. దేవుడే ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించమన్నాడని గట్టిగా నమ్మింది. అనుకున్నదే తడువుగా ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా సుమారు 6 ఏళ్ల పాటు తన దగ్గరున్న డబ్బును ఆ బ్యాంక్‌లో డిపాజిట్ చేసింది. తన సొమ్మంతా స్వర్గానికి చేరుకుంటోందని భావించింది. అంతటితో ఆగలేదు.. తన దగ్గర డబ్బులు లేకపోయినా, లోన్ తీసుకుని మరీ పంపించింది. ఇలా సుమారు రూ. 2.76 కోట్లు ఆ ‘చర్చి ఆఫ్ హెవెన్’ బ్యాంక్‌లో జమ చేస్తూ వచ్చింది. ఆమె అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోవడంతో  పిల్లలకు తల్లిపై అనుమానమొచ్చింది. ఏం జరిగిందోనని తల్లిని విచారించగా, అసలు విషయం బయటపడింది. కాగా, తల్లి ఇంటికి దగ్గరలో నివాసముంటున్న ఓ వ్యక్తి ఈ తతంగం మొత్తాన్ని నడిపించాడని తెలుసుకుని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారి కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని జైలులో ఊసలు లెక్కపెట్టించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)