బైజూస్ ఉద్యోగి ఆకాంక్ష ఖేమ్కా సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగులు, కస్టమర్లను కంపెనీ మోసగిస్తోందని ఆరోపించారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, తనకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని సాయం కోరుతూ లింక్డ్‌ఇన్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆకాంక్ష ఖేమ్కా ఏడాదిన్నర పాటు బైజూస్ లో అకడమిక్ స్పెషలిస్ట్‌గా పని చేశారు. ఇటీవల ఆమె పేరును లేఆఫ్ జాబితాలో చేర్చారు. అయితే, కారణం లేకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆకాంక్ష మనస్తాపం చెందారు. లింక్డ్ఇన్ వేదికగా తన ఆవేదన బయటపెట్టారు. ''తక్షణమే రాజీనామా చేయాలని వారు నాకు లేఖ పంపారు. లేదంటే వేతనం చెల్లించబోమని బెదిరించారు. నా వేరియబుల్స్, ఇతర చెల్లింపులు కూడా చేయలేదు. నా కుటుంబానికి ఇప్పుడు నేనే ఆధారం. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదు. లోన్‌లు చెల్లించాలి. జీతం, బకాయిలు ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి?'' అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ''ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు నాకు ప్రభుత్వం నుంచి సాయం కావాలి. లేదంటే చావు తప్ప మరో మార్గం లేదు. నేను స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే నా జీతం నాకు రాదు. దయచేసి సాయం చేయండి. ఇక ఈ విషపూరిత పని విధానం నుంచి బయటపడేలా మిగతా ఉద్యోగులకు కూడా సాయం చేయాలని కోరుతున్నా. బైజూస్ అనేక మోసాలకు పాల్పడుతోంది. కస్టమర్లు, ఉద్యోగులను కూడా మోసగిస్తోంది'' అని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://t.me/offerbazaramzon
బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ ఉద్యోగిని !
July 28, 2023
0
Tags