మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం, సమగ్ర పరిశీలన అవసరమని న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు తెలిపారు. లింగ సమానత్వానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. లోక్‌సభలో మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా రాజ్యాంగ (108వ ) సవరణ బిల్లు 2010 మార్చిలో నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ 15వ లోక్‌సభ బిల్లును ఆమోదించలేదు. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల (ఎఫ్‌టిఎస్‌సి) ద్వారా తాము 1.69 లక్షల కేసులను పరిష్కరించామని మరో ప్రశ్నకు సమాధానంగా మేఘ్వాల్ పేర్కొన్నారు. ఇంకా 1.95 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. https://t.me/offerbazaramzon
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం, సమగ్ర పరిశీలన అవసరం !
July 28, 2023
0
Tags