మధ్యప్రదేశ్లోని ఝూవువా జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ సునీల్ యాదవ్ ఝూ (56) ఆదివారం గిరిజన బాలికల హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు. ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ప్రిన్సిపల్ ను బయటే ఉండమని బాలికలను గది లోపలికి తీసుకు వెళ్లి వసతి గృహంలోని అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశాడు. తర్వాత బాలికల మంచంపై కూర్చొని వారిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు ఇబ్బంది పడేలా మాట్లాడాడు. తర్వాత జరిగిన విషయాలను బాలికలు తమ అధ్యాపకులకు వివరించారు. అధ్యాపకులు ఆ ఉన్నతాధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీల పేరుతో చేసిన నిర్వాకాన్ని పోలీసులకు తెలిపారు. అధ్యాపకుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుండి సస్పెండ్ చేశారు. పోలీసులు సునీల్ యాదవ్ ను స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచి, జుడిషియల్ కస్టడీకి తరలించారు. https://t.me/offerbazaramzon
హాస్టల్ లో బాలికలతో డిప్యూటీ కలెక్టర్ అసభ్య ప్రవర్తన !
July 12, 2023
0
Tags