పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని కాల్చి చంపిన దుండగులు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ భరత్‌పూర్‌లో కుల్దీప్‌ అనే గ్యాంగ్‌ స్టర్‌ బీజేపీ నేత కృపాల్‌ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్‌ 4, 2022లో ఈ హత్య జరగ్గా,  ఆ మరుసటిరోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కుల్దీప్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే  పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్‌, సహ నిందితుడు విజయ్‌పాల్‌ను ఇవాళ జైపూర్‌ జైలు నుంచి భరత్‌పూర్‌ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు. ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి, కుల్దీప్‌ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్‌ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్‌పాల్‌ గాయపడగా, అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జైపూర్‌-ఆగ్రా నేషనల్‌ హైవేపై అమోలీ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం  సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)