ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో మరో ఘటన

Telugu Lo Computer
0


ఢిల్లీ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ తరహాలో తాజాగా మరో యువతి హత్యకు గురైంది. ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలోని గీత కాలనీలో గల ఓ ఫ్లై ఓవర్ వద్ద చల్లాచెదురుగా పడి ఉన్న మహిళ శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫ్లై ఓవర్ పరిసరాల్లో మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన శరీర భాగాల కోసం ఫ్లై ఓవర్ సమీపంలోని అటీవీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)